మిడుతూరు నుండి 29 మంది టీచర్ల బదిలీ
1 min read– ప్రాథమిక పాఠశాలల్లో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలం నుండి 29 మంది ఉపాధ్యాయులు ఇతర మండలాలకు బదిలీ అయినట్లు మండల విద్యాశాఖ అధికారి పి. మౌలాలి తెలిపారు.ఈసందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మిడుతూరు మండలంలో ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తూ ఇతర మండలాలకు జిల్లా పరిషత్ పాఠశాలలకు మరియు ప్రాథమిక పాఠశాలలకు 25 మంది ఉపాధ్యాయులు, ఆరు మంది సర్ ప్లస్ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. అంతేకాకుండా ఇతర మండలాల నుంచి మిడుతూరు మండలానికి 20 మంది ఉపాధ్యాయులు అందరూ కూడా జిల్లా పరిషత్ మరియు ప్రాథమికోన్నత పాఠశాలల్లో విధుల్లో చేరారని అన్నారు.ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులు ఎవరూ కూడా రాలేదని ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులు ఎవరు రాకపోవడం పట్ల ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఎంఈఓ తెలిపారు.మండలంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటం పట్ల జిల్లా అధికారులు స్పందించి వెంటనే మండలంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కోరుతున్నారు.