గోనెగండ్ల మండలంలో 45 మంది ఉపాధ్యాయులు బదిలీ
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండలంలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 45 మంది ఉపాధ్యాయులు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు ఎంఇఒ వినోద్ కుమార్ తెలిపారు. గురువారం బదిలీ అయిన ఉపాధ్యాయులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న 45 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద స్కూల్ అసిస్టెంట్లుగా తాత్కాలిక పదోన్నతిపై వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లినట్లు తెలిపారు. వారందరికీ నెలకు రూ.2500 చొప్పున అదనపు భత్యం అని తెలిపారు.వీరి స్థానంలో ఏర్పడిన ఖాళీలను అదనపు సిబ్బంది ఉన్న పాఠశాలల నుంచి సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే గోనెగండ్లలోని బీసీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రభుత్వం చేపట్టిన వర్క్ అడ్జస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా తాత్కాలిక పదోన్నతిపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ పాఠశాలలో బోధన సిబ్బంది లేక ఖాళీ కానుందని,ఇలాంటి పాఠశాలలో మండలంలోని అదనపు సిబ్బంది ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను నియమిస్తామని ఎంఇఒ వినోద్ కుమార్ తెలిపారు.