PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిక్షాటన చేస్తున్న వృద్ధురాలిని వన్ స్టాప్ సెంటర్ కు తరలింపు

1 min read

కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులు అప్పగింత

సహకరించిన పోలీస్ సిబ్బంది ..తల్లిదండ్రులను వదిలేస్తే చట్టపరమైన చర్యలు

శిశు సంక్షేమ సాధికారత అధికారి..కె పద్మావతి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : భిక్షమెతుకుంటూ ఉన్న  వెంకట రమణ (65)దాసరి గూడెం, ఏలూరు మండలం, మరియు మల్లవల్లి భాగ్యం(62) కవ్వ గుంట, పెదవేగి మండలం కు చెందిన ఇరువురు వృద్ధులు బస్ స్టాప్ మరియు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వారి కార్యాలయం నందు బిక్షం ఎత్తుకొనుచుండగా గుర్తించి   వారి కుటుంబ సభ్యుల పిలిచి వారికి  కౌన్సిలింగ్ నిర్వహించి , ఇలా తల్లితండ్రులను బాధ్యతారహిత్యంగా వదిలివేస్తే  వారి పిల్లలపైన మరియు కుటుంబ సభ్యుల పైన తగు చట్ట పరమైన చర్యలు తీసుకొనడం జరుగుతుందని  ప్రాజెక్ట్ డైరెక్టర్ మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి  తెలియజేసారు. వన్ స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మిన్ సిబ్బంది వారిని వన్ స్టాప్ సెంటర్ కు తీసుకువెళ్ళి స్నానం చేయించి, భోజనం పెట్టి వారి వివరములు తెలుసుకొని వారి  కుటుంబ సభ్యులకు తెలియపరచారు. వారిని వన్ స్టాప్ సెంటర్ కు పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించటం జరిగింది. అలాగే  సంభదిత గ్రామ మహిళా కార్యదర్శి వారికి మరియు లోకల్ అంగనవాడి కార్యాలయం సిబ్బందికి వీరిని ఫాలో అప్ చేయవలసినదిగా తెలియజేసినారు, జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికరత అధికారి  కె.పద్మావతి, పోలీస్ సిబ్బంది సహకారంతో వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ కుమారి నిర్మల మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వదిలేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

About Author