బదిలీలు చేపట్టాలి: ఆపస్ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: కమీషనర్ కార్యాలయం నందు విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ గారిని కలసి వేసవి సెలవుల్లో బదిలీలు నిర్వహించాలని, 2500 తో పనిచేస్తున్న ప్రమోషన్ ఉపాధ్యాయులకు శాశ్వత ప్రాతిపదికన ప్రమోషన్లు ఇవ్వాలని, విద్యా విషయక కేలండర్ తయారీలో ఉపాధ్యాయ సంఘాలను భాగస్వామ్యం చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ త్వరగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రావణ్ కుమార్ ఎస్ బాలాజీలు కోరారు. ఉపాధ్యాయులపై యాప్ ల భారాన్ని తొలగించాలని, ఉపాద్యయులను భోదనకు మాత్రమే పరిమితం చేయాలని వారు కోరారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానంద రెడ్డి గారిని కలిసి పదవ తరగతి పరీక్షల మూల్యాంకన రేట్లు పెంచాలని, సైన్సు గణితము పరీక్షల్లో కొన్ని ప్రశ్నల మార్కుల విషయం అసంబంధంగా ఉందని వాటిని సరిచేసి విద్యార్థులకు మార్కులు కలిపే విధంగా చూడాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా వారు పరిశీలించి విద్యార్థులకు తగు న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రావణ కుమార్ & యస్ బాలాజీ రాష్ట్ర అధ్యక్షులు & ప్రధాన కార్యదర్శి ఎపియుయస్ పాల్గోన్నారు.