‘మహానంది’లో పారదర్శక పాలన.. : ఈఓ
1 min read
పల్లెవెలుగు వెబ్, మహానంది: కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో పారదర్శక పాలన అందించడమే లక్ష్యమన్నారు ఆలయ ఈఓ చంద్రశేఖర్ రెడ్డి. శనివారం మహానంది ఆలయం ఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహేష్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఓ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల చివరి నుండి ప్రారంభమయ్యే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మహానంది క్షేత్రంలో అందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకాడేది లేదని అన్నారు .తెల్లని పేపర్ మాదిరిగానే పదవీ బాధ్యతలు చేపడుతున్న మని తెల్లని పేపర్ మాదిరిగానే చివరి వరకు ఉంటామని అన్నారు .మరకలు తగిలితే సహించలేమాని అలా జరిగితే వెంటనే మాతృ సంస్థకు వెళ్ళటానికి సిద్ధమేనని అన్నారు.ఉద్యోగులు ఏవైనా సమస్యలు ఉంటే తమకు నేరుగా తెలియపరచు కోవచ్చని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు .ఆయన వెంట పాలకమండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున మరికొంత మంది సభ్యులు పాల్గొన్నారు.