PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిక్కిన ఎలుగుబంటి.. జెఎస్డబ్ల్యు సిమెంట్ పరిశ్రమ వద్ద హల్చల్.

1 min read

పల్లెవెలుగు  వెబ్ గడివేముల : అడవిలో నుంచి జనావాసాల్లోకి వచ్చిన ఎలుగుబంటి శుక్రవారం నాడు కలకలం రేపింది గడివేముల మండల పరిధిలోని బిలకల గూడూరు వద్ద ఉన్న జెఎస్డబ్ల్యు సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో దారి తప్పి ఎలుగుబంటి ప్రవేశించడంతో యాజమాన్యం సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాదాపు 40 మంది ఫారెస్ట్ సిబ్బందితో ఎలుగుబంటిని బంధించడానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు వెలుగోడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏం ఏ ఖాన్ అద్వర్యంలో ఎలుగు బంటి కి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బంధించి బోనులో తీసుకువెళ్లారు ఆరోగ్య పరీక్షలు చేశాక అడవిలో వదిలిపెడతామని ఏలుగు బంటి వయసు ఐదు సంవత్సరాలు ఉంటుందని అటవి శాఖ అధికారులు తెలిపారు.

About Author