NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డైరెక్టర్ పై రాజ‌ద్రోహం కేసు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ సినీ ద‌ర్శకురాలు ఐషా సుల్తానా మీద రాజ‌ద్రోహం కేసు న‌మోదైంది. ల‌క్షద్వీప్ అడ్మినిస్ట్రేట‌ర్ ప్రపుల్ ప‌టేల్ ను కేంద్రం పంపిన జీవాయుధ‌మ‌ని పోల్చిన నేప‌థ్యంలో ఆమె మీద కేసు న‌మోదైంది. ఓ టీవీ చ‌ర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె మీద కేసు న‌మోదైంది. గ‌తంలో ల‌క్షద్వీప్ లో ఒక్క క‌రోన కేసు న‌మోద‌వ్వలేద‌ని, ఇప్పుడు రోజుకు 100 క‌రోన కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు. ప్రపుల్ ప‌టేల్ జీవాయుధ‌మ‌ని ఆమె అస‌హ‌నం వ్యక్తం చేశారు. మ‌రోవైపు ప్రపుల్ ప‌టేల్ నిర్ణయాల ప‌ట్ల ల‌క్షద్వీప్ లో అల‌జ‌డి నెల‌కొంది. ఆయ‌న నిర్ణయాలు వివాదాస్పద‌మ‌వడంతో స‌ర్వత్రా విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

About Author