పెగాసస్ పై సుప్రీం కోర్టులో విచారణ
1 min readపల్లె వెలుగు వెబ్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేసిన పెగసస్ వ్యవహారం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. ఇందుకు సంబంధించిన విచారణ సుప్రీం కోర్టులో గురువారం జరగనుంది. ద్విసభ్య ధర్మాసనం దీనిపై వాదనలు విననుంది. ప్రస్తుత లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రముఖ పాత్రికేయులు రామ్, శశికుమార్ తో పాటు, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, న్యాయవాది ఎం.ఎల్. శర్మలు వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారం పర్యవసానాలు ఎక్కువగా ఉన్నందున.. ప్రభుత్వం ఈ స్పై వేర్ వినియోగానికి అనుమతులు తీసుకుందా ? లేదా అన్న విషయం బహిర్గతం చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీరి వినతిని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్వీకరించారు. దీంతో గురువారం ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది.