తెగ నరికాడు..!
1 min readశ్రీకాకుళం:
శ్రీకాకుళంలో జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో తోడబుట్టిన వాడినే తెగనరికాడో వ్యక్తి. పశువుల పాకలో పాలు పితుకుతున్న అన్న సన్యాసిరావును.. తమ్ముడు రామకృష్ణ కత్తితో దాడి చేశాడు. వెంటనే సన్యాసి రావు తీవ్ర రక్తస్రావంతో రక్తపుమడుగులో పడిపోయాడు. అడ్డ వచ్చిన అక్కను కూడ రామకృష్ణ కత్తితో వేటు వేశాడు. ఆమె కూడ కుప్పకూలింది. సన్యాసిరావు, అతని సోదరి జయమ్మ ఇద్దరూ కూడ అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి… విచారణ చేస్తున్నారు.