తిరిగి సొంత స్కూల్ కి వెళ్తున్న ఉపాధ్యాయుడికి సన్మానం..
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: డిప్యూటేషన్ పై స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కు వచ్చిన సైన్సు ఉపాధ్యాయుడు బాల రాజు తిరిగి నలకదొడ్డి స్కూల్ కు వెళుతున్న సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భ్రమరాంబ ఆధ్వర్యంలో ఉపాద్యాయ ఉపాధ్యాయిని బృందం శాలువాతో,బోకేతో మరియు బోధనేతర సిబ్బంది ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా భ్రమరాంబ మాట్లాడుతూ, ఆయన విధులపట్ల అంకిత భావాన్ని,సమయపాలనను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.