అబ్దుల్ కలాంకు ఘన నివాళి.. ఎక్కడ.??
1 min readపల్లెవెలుగు ,వెబ్ గడివేముల: ఆదర్శానికి నిలువెత్తు రూపం.. యువతలో విజయకాంక్షలను రగిలించిన మిస్సైల్ మ్యాన్ భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణించి నేటితో 6 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఎందరో యువతకు స్ఫూర్తిని నింపి కలలంటే నీకు నిద్రలో వచ్చేవి కావు. నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేవి అని స్ఫూర్తి ని నింపిన అబ్దుల్ కలాం వర్ధంతి నేడు.అబ్దుల్ కలాం..వర్ధంతి సందర్భంగా ఆ మహాత్మునికి యావత్ భారత దేశం ఘన నివాళులర్పిస్తుంది. ఒక శాస్త్రవేత్తగా భారత దేశంలో అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి. కలాం దేశ యువతకు ఆదర్శప్రాయులు. గొప్ప మహనీయుని అబ్దుల్ కాలం చేసిన సేవలను గురించి మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో మండలంలో నేషనల్ స్టూడెంట్స్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ విద్యాలయాల్లో ఆయన చిత్రపటం ఏర్పాటు ఘనంగా నివాళులు అర్పించాల్సిన అధికారులు కనీసం ఆయన పేరు స్మరించుకోవడానికి కూడా సమయం లేదంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో మండలంలోని మేధావులు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు ప్రపంచం గుర్తించిన యువతలో స్ఫూర్తి రగిలించిన మహనీయుడిని చదువుకున్నవారే మరిచిపోవడం దురదృష్టకరం.. మన్నించు మిసైల్ మాన్.