PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో ఇంజినీర్లకు సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: లయన్స్ క్లబ్ అఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో స్థానిక గాలివీడు రోడ్డు మార్గాన ఉన్న శ్రీ నరసింహ ఏజెన్సీస్ నందు బుధవారం ఇంజనీర్స్ డే సందర్బంగా ఇంజనీర్స్ లయన్ నరసింహారెడ్డి,నాగేశ్వర్ రెడ్డిని సన్మానించినట్లు అధ్యక్షులు లయన్ చాన్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ ప్రతిభతో అసాధారణ విజయం సాధించినవారిలో భారతజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ మోక్ష గుండం విశ్వేశ్వరయ్య గారేనన్నారు. ఇంజినీర్‌గా మన దేశ ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా చాటారన్నారు. ఈ రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణాలను ఆవిష్కరించారు ఆయన మార్గదర్శకత్వంలో నిర్మాణాలు నేటికీ అవి చెక్కుచెదరలేదంటే అతిశయోక్తి కాదన్నారు.భారత్‌లో అత్యంత గొప్ప ఇంజనీర్ అయిన ఆయన జయంతి (సెప్టెంబరు 15)ని దేశవ్యాప్తంగా ‘ఇంజినీర్స్ డే’ గా జరుపుకుంటారని ఉపకార వేతనంతో పుణేలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విశ్వేశ్వరయ్య.. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిక్‌ వర్క్స్‌ శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఏడాది వ్యవధిలోనే ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. విశ్వేశ్వరయ్య పనితీరు అద్భుతంగా ఉండటంతో.. సుక్నూర్‌ బ్యారేజ్‌ నిర్మాణానికి ఇంజనీర్‌గా నియమితులయ్యారు. సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేయడంలో విశ్వేశ్వరయ్య కీలక పాత్ర పోషించారు 1909లో మైసూర్‌ ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను చీఫ్‌ ఇంజనీర్‌‌గా నియమించింది మైసూర్‌ సమీపంలో నిర్మించిన కృష్ణరాజ సాగర్ ఆనకట్టకు ఆయనే చీఫ్ ఇంజినీర్‌గా వ్యవహరించారని తెలిపారు అనంతరం రిజియాన్ చైర్మన్ లయన్ అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ 1912 నుంచి 1918 వరకు మైసూర్ దివాన్‌గా పనిచేసిన విశ్వేశ్వరయ్య మైసూర్‌లోని కృష్ణరాజసాగర్ (కె.ఆర్.ఎస్) నిర్మించారు. మైసూర్ ‘ఆదర్శ నగరం’గా మారడంలో ఆయన పాత్ర ఎనలేనిదన్నారు.హైదరాబాద్, ముంబయి నగరాలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ రూపకల్పన విశాఖపట్నం పోర్ట్ ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం అని తెలిపారు. అనంతరం రీజనల్ కోఆర్డినేటర్ లయన్ హరినాధ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎలాంటి డ్యామేజీ లేకుండా 1903లో మహారాష్ట్రలోని పూనే సమీపంలో ఖదక్ వాస్తా రిజర్వాయర్ కు ఆటోమేటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్ గేట్లను ఏర్పాటు చేశారు. ఇదంతా ఆయన సొంతంగా డిజైన్ చేసినది. దీనికి గాను ఆయనకు పేటెంట్ రైట్ కూడా దక్కింది. ఈయన నిర్మించిన డ్యామ్ కు ఎలాంటి డ్యామేజీ లేకుండా వరద నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం దొరికిందని తెలిపారు అనంతరం ఇంజనీర్ లయన్ నరసింహ రెడ్డి మాట్లాడుతూ మన తెలుగు ప్రజలకు తరతరాలకు గుర్తుండిపోయేలా ఆయన చూపిన ప్రతిభను ప్రస్తుతం ప్రపంచంలోని ప్రఖ్యాత ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పాఠాలుగా బోధిస్తున్నారు. దీంతో ఆయన గురించి తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో సాగరం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఆ సమయంలో సాగర తీరం నుండి రక్షించే వ్యవస్థను రూపొందించి ఆయన చిరస్మరణీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు అంతేకాదు కోట్లాది మంది భక్తులు ప్రయానించే తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది కూడా ఆయనే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లయన్ ఇందాద్ అహమ్మద్,లయన్ సుబ్బా రెడ్డి పాల్గొన్నారు.

About Author