NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీఆర్​డీఎస్​ ఆధ్వర్యంలో ‘గౌతమి’ కి ఘనసన్మానం

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో గుజరాత్ లో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 4వ స్ధానంలో నిలిచిన వీరబల్లి ఎస్.డి.కే.ఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థిని గౌతమి ని వీఆర్డీఎస్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ఎస్.డి.కె.ఆర్ డిగ్రీ కళాశాల యాజమాన్యం శాలువ, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కళాశాల డైరెక్టర్ దుగ్గనపల్లె రవి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. మారుమూల ప్రాంతానికి చెందిన తమ విద్యార్థిని గౌతమి జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించడం హర్షించదగ్గ విషయమన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని కూడా పొందవచ్చన్నారు. అలాగే వీఆర్డీఎస్ సంస్థ చైర్మన్ సురేంద్రారెడ్డి మాట్లాడుతూ నేటి యువత చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, క్రీడలపై తగ్గుతున్న ఆసక్తి కూడా దీనికి కారణం కావచ్చన్నారు. క్రీడాకారిణి గౌతమి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో జాతీయ స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్ షిప్ కు భారత జట్టు కు ప్రాతినిధ్యం వహించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author