NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మిక నేతలకు సన్మానం…

1 min read

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : మండల కేంద్రమైన చాగలమర్రిలోని  చాగలమ్మ ఆలయ ప్రాంగణంలో  సోమవారం కార్మిక నేతలైన హమాలి యూనియన్ గౌరవాధ్యక్షుడు, సిపిఎం నాయకుడు గుత్తి నరసింహుడు, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ( ఏఐటీయూసీ ) రాష్ట్ర కౌన్సిల్ మెంబర్  చంద్రకళ, చాగలమర్రి మండలం పారిశుద్ధ్య కార్మికుల సంఘం అధ్యక్షురాలు సునీతల కు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. నిరోధక సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీల వినూత్న నిరసన కార్యక్రమాలలో సహాయ సహకారాలు అందించినందుకు గుత్తి నరసింహులు సునీత ను అభినందించారు. అలాగే విజయవాడలోని  ధర్నా చౌక్ వద్ద  ఆమరణ నిరాహార కఠోర దీక్షలో 7 రోజులు పాల్గొని ప్రాణాలు సైతం లెక్కచేయకుండా,  అనారోగ్యానికి గురైన డిమాండ్ల సాధనకై కృషి చేసినందుకు  ప్రత్యేకంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ చంద్రకళ ను సన్మానించారు. సమ్మెకు సహకరించిన ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు, 42 రోజులుగా పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసిన పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు  హసీనా, వహీదా, సుజాత, ఇందుమతి, ఖానాపురం భాగ్య కుమారి, ముత్యాలపాడు హసానమ్మ, శెట్టి వీడు జాన్ బీబీ, అహల్య, సుబ్బలక్షమ్మ, అంగన్వాడి సహాయక నాయకురాలు  గురమ్మ, జ్యోతి, మేరీ,సుజాత,పద్మావతి,గౌరీ,భార్గవి, మాబు చాన్,దిల్ షాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author