NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెరియర్​ రామస్వామి నాయకర్​కు ఘననివాళి

1 min read

ఆస్పరి: కులరహిత  సంఘసంస్కర్త, సామాజిక ఉద్యమకారుడు పెరియర్ రామస్వామి నాయకర్ అని బహుజన సమాజ్ పార్టీ ఆలూరు తాలూకా అధ్యక్షులు రామలింగయ్య, ఆస్పరి మండల కన్వీనర్ కొమ్మ రమేష్ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెరియార్  రామస్వామి నాయకర్ 143వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో కులం ఉండరాదని.. విద్యకు అధిక ప్రాముఖ్యత ఇచ్చిన గొప్ప మేధావి అన్నారు. అదేవిధంగా సమాజంలో సమానత్వం కోసం నిరంతరం పోరాడినారని ఆయన పేర్కొన్నారు. దేశంలో దోపిడి వర్గాల నిర్మూలించినప్పుడు సమానత్వం ఏర్పడుతుందని. గట్టిగా నమ్మిన గొప్ప మేధావి పెరియార్ గారు అని అన్నారు. ఆయన ఆలోచనలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. జయంతి వేడుకలలో తాలూకా అధ్యక్షులు రామలింగయ్య మాట్లాడుతూ బీసీ సామాజికి వర్గంలో నుంచి వచ్చినప్పటికీ బహుజన కోసం తన జీవితాన్ని దారబోసిన గొప్ప మహనీయుడు అలాంటి ఆయన కోసం ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా కనీసం జయంతి గాని వర్ధంతి గాని జరుపుకోవాలని ప్రతి ఒక్క బీసీ వ్యక్తి ఇప్పటికైనా ఆయన గుర్తించి ఆయన నడిచిన బాటలో నడవాలని అలాగే ఇతర పార్టీల్లో ప్రతి ఒక్క బహుజనులు చెంచాలుగా బతికే కన్నా చావే నయమని ఆయన తెలిపారు .ఆరోజు జ్యోతిరావు, పె రియర్ రామస్వామి, అంబేద్కర్లు బాటలో నడవాలని  ప్రతి ఒక్క బహుజనులు సిగ్గుపడాలి అగ్ర కులస్తుల పార్టీలో ఉండి వాళ్లకు చెంచాలుగా మారినందుకు ఆ మహనీయులు ఆ రోజు చనిపోలేదని ఈరోజు వాళ్ల కోసం ఎంతో కష్టపడి ఇంత చేసిన మహనీయులు ఇప్పుడే చనిపోయినట్టు బహుజన సమాజ్ పార్టీ భావిస్తుంది ఆయన మండల అధ్యక్షుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ప్రజలే బుద్ధి చెబుతారని రానన్నది బహుజన రాజ్యమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author