NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీస్ అమర వీరులకు ఘనంగా నివాళి

1 min read

–పోలీస్ అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించిన
–జిల్లా ఎస్పీ రఘువీరా రెడ్డి,జిల్లా కలెక్టర్ మునజిర్ జిలానీ శామ్యూల్
పల్లె వెలుగు , వెబ్​ బనగానపల్లె : నంద్యాల ఎమ్మేల్యేలు కాటసాని రామిరెడ్డి గారు,శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి,శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి,ఏపీ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కర్రా గిరిజా రెడ్డి,అధికారులు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం అవరణం లో జిల్లా ఎస్పీ రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరులైన పోలీస్ వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గా జిల్లా కలెక్టర్ మునజీర్ జిలాని శామ్యూల్ ,బనగానపల్లె,నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి గారు,శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి గారు, శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి , ఏపీ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కర్రా గిరిజా రెడ్డి ల తో పాటు జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా బనగానపల్లె ఎమ్మేల్యే కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీస్ వీరుల త్యాగాలను మనం మననం చేసుకోవలసిన అవసరం ప్రజలందరి మీద వుందని చెప్పారు.వారి ప్రాణాలను పణం గా పెట్టీ ప్రజల మాన, ప్రాణ సంరక్షణ కొరకు పాటు పడుతున్నారు అని పోలీస్ వారి సేవలు వెలకట్టలేనిది అని పోలీస్ సేవలను కొనియాడారు.నిత్యం ప్రజల సంరక్షణ కొరకు పాటుపడే పోలీస్ లకు,వారి కుటుంబాలకు అండగా మనమందరం వుండాలి ఆని చెప్పారు.

About Author