రాష్ట్ర సహకార బ్యాంకు అధ్యక్షురాలికి సన్మానం
1 min read
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : కడప జిల్లా కేంద్ర సహకార బ్యాంకు , రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలు మల్లెల ఝాన్సీ రెడ్డిని బుధవారం ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన రాయచోటి డివిజన్ పరిధిలో ని సహకార సంఘాల అధ్యక్షులు ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి శాలువ కప్పి సత్కరించారు. అనంతరం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో నామినేటెడ్ పదవులలో మహిళలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో సహకార బ్యాంకు Asst. మేనేజర్ రామ చంద్ర మరియు కడప జిల్లా సహకార సంఘాలఉద్యోగుల యూనియన్ ట్రసరేర్ రెడ్డి బాబు గొర్లముడివీడు సంఘ సి ఈ ఓ సాబ్జాన్, దేవపట్ల ఆన్సర్, పెడ్డివీడు చంద్ర శేఖర్, మరియు ఇతర సంఘాల సిబ్బంది ఉన్నారు.