NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

10న ‘కురువ’ ప్రజాప్రతినిధులకు సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఆదోని: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పోరేట్ లుగా గెలిచిన కురువ ప్రజాప్రతినిధులను అక్టోబర్ 10న ఘనంగా సన్మానిస్తున్నట్లు కురువ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ పుల్లన్న, జిల్లా అధ్యక్షుడు పెద్దహరివాణం దేవేంద్రప్ప తెలిపారు. మంగళవారం ఆదోని కార్యాలలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సర్పంచ్​లుగా 68 మంది, ఎంపీటీసీలుగా 49 మంది, జెడ్పీటీసీలుగా ఇద్దరు, కౌన్సిలర్లుగా ముగ్గురు, జెడ్పీటీసీలుగా ఇద్దరు కురువలు గెలుపొందడం గర్వకారణమన్నారు.

ఆదోని భీమాస్ ఫంక్షన్ హల్ లో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడిన కురవలను అక్టోబరు 10న సన్మానిస్తున్నామని, కార్యక్రమానికి హిందుపూరం ఎంపీ గోరంట్ల మాధవ్ , రోడ్లు, భవనాల శాఖ మంత్రివర్యులు శంకర్ నారాయణ హాజరవుతారని, కురువ కుటుంబ సభ్యులు పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో కౌతాళం ఎంపిపి అమరేష్ ,రఘురామ్, లక్ష్మన్న, దర్గప్ప ,ఉరుకుందు ,వీరేష్, కల్లె లక్ష్మన్న, దివాకర్ , భానుప్రకాష్ కురువ సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Author