ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరికి ఘనసన్మానం
1 min read
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: భావితరాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని .. ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేసిన రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జి. సాయి ప్రసాద్ ఐఏఎస్ ఎందరికో ఆదర్శమని హార్ట్ ఫౌండేషన్ సెక్రటరి డా. చంద్రశేఖర్ అన్నారు. తనతోపాటు డా. భవాని ప్రసాద్‌తో కలిసి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరి జి. సాయిప్రసాద్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా వేసి సన్మానించారు. అనంతరం డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ 2000–2003 మధ్యలో కర్నూలు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన జి. సాయి ప్రసాద్ ఐఏఎస్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సూపర్ స్పెషలిటీ బ్లాక్, ఏఎంసీ యూనిట్‌తోపాటు పలు శాఖల అభివృద్ధిలో జి. సాయి ప్రసాద్ కృషి అభినంద నీయమన్నారు. రాయలసీమతోపాటు మహబూబ్‌నగర్, కర్ణాటకలోని రాయచూరు నుంచి వివిధ వైద్య చికిత్సల కోసం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వస్తున్నారంటే.. అప్పట్లో కలెక్టర్ జి. సాయి ప్రసాద్ ఏర్పాటు చేసిన వసతులు, అభివృద్ధి, చొరవే ప్రధాన కారణమన్నారు. ఆయనకు కర్నూలువాసులు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ వెల్లడించారు.