NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్యాగమూర్తి రమాబాయి కి ఘన నివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి 125 వ జన్మదిన వేడుకలు స్థానిక మాలమహానాడు కార్యాలయం నందు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా రమాబాయి చిత్రపటానికి మాల మహానాడు తాలూకా అధ్యక్షులు నగేష్ , మాల మహానాడు సీనియర్ నాయకులు డాక్టర్ రాజు , పట్టణ అధ్యక్ష కార్యదర్శులు చరణ్ తేజ, మనోహర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం తన సర్వస్వం సమర్పించి తన కుమారులను సైతం త్యాగం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యకు తోడ్పడుతూ బడుగు బలహీన వర్గాల ఆశను, ఆత్మగౌరవాన్ని కాపాడుటలో అంబేద్కర్ కు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి న త్యాగధనురాలు రమాబాయి అన్నారు. ఇలాంటి త్యాగమూర్తి బాటలో వారి ఆశయ సాధనలో అనునిత్యం నడుస్తూ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పోరాడుతూ జాతిని ఐక్యం చేస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దానమయ్య, నరసింహ, విక్రమ్, తిరుమల్, ఉసేన్, స్వామిదాసు తదితరులు పాల్గొన్నారు .

About Author