PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవలందించే మహిళలకు సన్మానం

1 min read

– మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా చేపట్టే కార్యక్రమంలో

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, జలవనరుల శాఖ చైర్మన్ కర్ర హర్ష వర్ధన్ రెడ్డి గారు, స్థానిక 17వ వార్డ్ కార్పొరేటర్ కైపా పద్మలత రెడ్డి

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: నగరం లోని స్థానిక మాంటెస్సోరి స్కూల్ ఎదురుగా ఎంఎంఐ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా చేపట్టే ఔత్సాహిక మహిళచే ఎగ్జిబిషన్ అండ్ సేల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మానవతా మహిళ విభాగం నగర అధ్యక్షులు యాని ప్రతాప్ గారు కార్యక్రమానికి అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, కర్ర హర్ష వర్ధన్ రెడ్డి గారు,మానవతా జిల్లా కన్వీనర్ మనోహర్ రెడ్డి గారు,పాల్గొన్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని వారు కొనియాడారు కార్యక్రమంలో స్పోర్ట్స్ మహిళలకు పర్యావరణ పరిరక్షణ కొరకే సేవాందించే మహిళలకు సామాజిక కార్యక్రమంలో తోడ్పాటు నుంచే మహిళలకు సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాటిల్ హనుమంత్ రెడ్డి గారు యుగంధ శెట్టి గారు అపర్ణ గారు దీప గారు ఉమా గారు లక్ష్మీ గారు బాలకృష్ణ రెడ్డి గారు ప్రభాకర్ గారు పద్మజ గారు పాల్గొన్నారు.

About Author