దళిత మృతవీరులకు నివాళులు
1 min readపల్లెవెలుగు వెబ్ హోలగుంద: హోలగుంద మండలం, ఇంగళ్ దాహాలు గ్రామంలోకామ్రేడ్ గాదెప్ప అధ్యక్షతన కారంచేడు, చుండూరు దళిత మృతవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాప సభను నిర్వహించుకొవడం జరిగింది . ఈ సమావేశానికి సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి మనీ, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి వెంకప్ప తదితరులు పాల్గొని దేశంలో దళితులపై ,మైనార్టీలపై మహిళలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయని వీటిని నిరోధించడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయని, దళితులపై,మైనార్టీలపై ఆదివాసీలపై మతోన్మాద ప్యాసిస్టు దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కారంచేడు ,చుండూరు ,వేంపెంట దళితులపై మారణ హోమాన్ని సాగించి దళితుల ప్రాణాలను బలిగున్నారని దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలో దళిత బహుజన ఉద్యమాలు ముందుకొచ్చాయని దళితులు ,ఆదివాసీలు, మతమైనా టీలు , హక్కుల కొరకు, ఆత్మగౌరవం కొరకు పోరాడాలని సభలో పాల్గొన్న వారి నిర్దేశించి మాట్లాడారు .పోరాటాల వల్లనే హక్కులు సాధించుకుంటామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ముని ,బొజ్జప్ప , షేక్ అమ్మమల్లప్ప, కర్రి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.