అమరవీరులకు నివాళులు
1 min read
పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు అటవీశాఖ అధికారులు సిబ్బంది నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అమరవీరుల దినోత్సవ సందర్భంగా స్థానిక అటవీ కార్యాలయం ప్రాంగణంలో గురువారం రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు సిబ్బంది అటవీ అమరవీరులకు నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి మాట్లాడుతూ అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో వివిధ కారణాలతో ప్రాణాలు అర్పించిన అటవీ అమరవీరులను స్మరించుకోవడం జరిగిందని వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ మేమున్నామంటూ వారికి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. నివాళులు అర్పించిన వారిలో అహోబిలం డిఆర్ఓ సెక్షన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.