NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ కు ఘన నివాళులు

1 min read

హొళగుంద టీడీపీ నాయకులు

సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మండల కేంద్రంలో  తెలుగుదేశం కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రివర్యులు,విశ్వవిఖ్యాత నటసార్వభౌమ,స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి కార్యక్రమo లో తెలుగుదేశం పార్టీ   సీనియర్ నాయకులు మాజీ రాష్ట్ర తెలుగు యవత కార్యదర్శి CH శేషిగిరి గారు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని అలాగే సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నిజాయితీగల నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమం లో మండల కన్వీనర్, సీనియర్ నాయకులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, కోట్ల అభిమానులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, బూత్ ఇంచార్జ్ లు,తదితరులుపాల్గొన్నారు.

About Author