67 వ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: భారతరాజ్యాంగ నిర్మాత, ప్రపంచమేధావి, దళిత, గిరిజన, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67 వ వర్ధంతి సందర్భంగా పాణ్యం లో SFI జిల్లా నాయకుడు బత్తిని ప్రతాప్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోSFI సీనియర్ నాయకులు రాజా సతీష్లు మండలం నాయకుడు రాజా అనిత,తదితరులు కార్యక్రమంలో AIFB రాష్ట్ర నాయకులు వనము వెంకటాద్రి తదితరులు ఆమహనీయునికి ఘన నివాళలర్పించడం జరిగింది* *ఈ సందర్బంగా SIF జిల్లా నాయకుడు బత్తిని ప్రతాప్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ ఆయన పెట్టిన నటువంటి రిజర్వేషన్లలో ఉద్యోగాలు సంపాదించుకొని ఆయనకు నివలా లు కూడా అర్పించలేని అధికారులు ఎందుకు ఉన్నారు. పాణ్యం మండలం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదు ఎకరాలు కేటాయించాలి. విద్యార్థులకు ఉపయోగకరంగాఉపాధి కల్పించాలి అందులో స్థానికులకే 90% కేటాంచాలి. భారతదేశంలో ఎక్కువ శాతం దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలి. పేద బడుగు బలహీన వర్గాలకు, చెందిన ప్రకారమే చదువుకున్న నిరుద్యోగులకు వారి రిజర్వేషన్ల ప్రకారమే ఉద్యోగాలు కేటాయించాలని. రాబోయే రోజులలో యువత ముందుకు సాగేలా ఉండలని వారు కోరారు. అనంతరం వనము వెంకటాద్రి మాట్లాడుతూ., పాణ్యం నియోజకవర్గంలో కుల వివక్ష, బడుగు బలహీన వర్గాల పైనే, ఎక్కువ కేసులు నమోదు చేస్తూ దళితులను, పైకి ఎదగకుండా చూస్తున్నారు. సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తే వారి పైన కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మహిళలకు, యువకులకు విద్యార్థులకు పాణ్యం మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ ఏర్పాటు చేసి త్రాగుటకు నీరు ఏర్పాటు చెయాలి అన్నారు.ఈ కార్యక్రమం లో సమాజ్ వాది పార్టీ జిల్లా నాయకుడు శివ కృష్ణ, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.