మల్లయోధుడు మూలయం సింగ్ యాదవకి ఘనమైన నివాళులు
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల : మల్లయోధుడు మూలయం సింగ్ యాదవకి ఘనమైన నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘం ,యాదవ సంఘం సభ్యులు.. స్థలం:విగ్నేష్ డెవలపర్స్ భారతదేశ చరిత్రలోనే బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరం పోరాడుతూ అగ్రవర్ణాలను ఎదిరించి చట్టసభల్లో బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మల్ల యోధుడు మూలయం సింగ్ యాదవ్ ప్రథమ వర్ధంతి ఈరోజు నంద్యాల జిల్లాలో ఘనంగా జరపడమైనది. మనకు స్వాతంత్రం వచ్చి నేటిగా 75 సంవత్సరాలు పూర్తయిన నేటికీ దేశవ్యాప్తంగా 60 శాతం పైన బీసీలు అలాగే 30% పైనున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు ఈరోజు రాజ్యాధికారానికి దూరంగా ఉండి విద్యా ఉద్యోగాలకు దూరమవుతూ ప్రమోషన్లకు దూరమవుతూ అనగారిన కులాలుగా ముద్రించబడి దోపిడీకి గురవుతున్నాం. ఇలాంటి తరుణంలో ఉత్తర ప్రదేశ్ లో మాన్యశ్రీ కాన్సిరాంతో కలిసి మూలయం సింగ్ యాదవ్ చేసిన నిరంతర పోరాటమే ఆరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసింది.ఇదే నినాదం దేశవ్యాప్తంగా కొనసాగాలని నా జాతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు అధికారంలోకి రావాలని వారికి రావాల్సిన విద్య ఉద్యోగ రాజకీయ పదవులు చట్టసభల్లో పోరాడి సాధించడం కోసం ఎన్నో పోరాటాలు చేయటం జరిగింది. కావునవారి ఆశయ సాధనలో వారి అడుగుజాడల్లో నడిచి బీసీ, బహుజనుల, హక్కులకై పోరాడి బహుజన రాజ్యం స్థాపించి ఆమహానుభావుడి ఆశయాలు కొనసాగిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వై నాగ శేషు , మరియు విగ్నేష్ డెవలపర్స్ పృథ్వీరాజ్ , బోధనం చంద్ర శేఖర్ ,పెరుగు శివ కృష్ణ యాదవ్ ,నగేష్ నాయుడు ,చల్లా సుధాకర్ బాబు సురేష్ యాదవ్ ,నక్కా రాజేష్ తదితరులు పాల్గొని ఘనమైన నివాళులు అర్పించడమైనది.