అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జగనన్న సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్టణంలోని 26వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి, కౌన్సిలర్ మందడి వాణి , అఖిల్ , జగనన్న సంక్రాంతి సంబరాలు ఆర్గనైజింగ్ కమిటీ స్వామిదాసు రవికుమార్ , పెరుమాళ్ళ శ్రీనాధ్ పర్యవేక్షణలో ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. ముగ్గుల పోటీల్లో మొత్తం 175 మంది మహిళలు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు చింత తులసమ్మ , నందికొట్కూరు పగిడ్యాల జడ్పీటీసీ పుల్యాల దివ్య , నందికొట్కూరు జడ్పీటీసీ కలీమున్నిసా , మిడ్తూరు ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ , పగిడ్యాల ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి , జూపాడుబంగ్లా ఎంపీపి సువర్ణమ్మ , కొత్తపల్లి ఎంపీపీ కుసుమలత, మహిళా ప్రతినిధులు దాసి అనసూయమ్మ , ఎక్కలదేవి సలోమి , సూదిరెడ్డి రాధ , కౌన్సిలర్ అబ్దుల్ రవూఫ్, జె.రాధిక, కృష్ణ వేణి, యం.లక్ష్మిదేవి, చింత లక్ష్మిదేవి, వైసీపీ నాయకులు మందడి రవింద్రా రెడ్డి , రమేష్, కురువ శ్రీను తదీతరులు పాల్గొన్నారు.