NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టాలీవుడ్ హీరో కంపెనీ నుంచే నా పై ట్రోలింగ్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌పైనా, త‌న కుటుంబ స‌భ్యుల‌పైనా జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై టాలీవుడ్ యువ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. త‌న తాజా చిత్రం జిన్నా మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్స్‌తో మంచు విష్ణు మంగ‌ళ‌వారం మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌పై, త‌న కుటుంబంపై జ‌రుగుతున్న ట్రోలింగ్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో త‌న‌ను, త‌న కుటుంబాన్ని టార్గెట్ చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. స‌ద‌రు హీరో జూబ్లిహిల్స్‌లోని ఓ హీరోకు చెందిన కంపెనీలో త‌న కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నార‌ని విష్ణు ఆరోపించారు.

                                    

About Author