తెరాస ఎమ్మెల్యేకు జైలు శిక్ష !
1 min readపల్లెవెలుగు వెబ్ : ఖైరతాబాద్ తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ కు జైలు శిక్ష పడింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారనే అభియోగాలు రుజువు కావడంతో ప్రజాప్రతినిధుల న్యాయస్థానం దానం నాగేందర్ కు శిక్ష విధించింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు వెయ్యి జరిమానా విధించింది. బంజారాహిల్స్ లో 2013లో కేసు నమోదైంది. దీనిపై అప్పీల్ కు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. శిక్ష అమలును న్యాయస్థానం వాయిదా వేసింది.