PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొత్త పార్టీ కోసం ఢిల్లీకి టీఆర్ఎస్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: డిసెంబర్ 9న ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 6న కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి టీఆర్ఎస్‌ ప్రతినిధులు వెళ్లనున్నారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్‌ సమావేశమైనారు. భేటీలో తాజా రాజకీయాలు, కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. దసరా రోజు మధ్యాహ్నం 1:19 గంటలకు కొత్త పార్టీ ప్రకటించనున్నారు. నూతన పార్టీ ప్రారంభం, దాని ఆవశ్యకత గురించే కాకుండా.. పార్టీ ప్రకటన తర్వాత అమలుచేయాల్సిన కార్యాచరణపైనా చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై ఈ సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా పార్టీ పేరు విషయంలోనూ కొంత అభిప్రాయ సేకరించినట్లు సమాచారం.

                                               

About Author