ట్రస్ట్ బోర్డు సర్వ సభ్య సమావేశం
1 min readపల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: శ్రీశైలంలో ట్రస్ట్ బోర్డ్ ఏడవ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్. లవన్న, మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం23 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా 21 అంశాలను ప్రతిపాదనలను ఆమోదం తెలిపారు ఒక అంశాన్ని తిరస్కరించారు ఒక అంశాన్ని సమీక్షించిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్నారు శ్రీశైలంలో వైభవంగా జరిగే శివరాత్రి ఉగాది మహోత్సవాలకు సమీక్షించారు ఐదు కోట్ల రూపాయలతో ప్రతిపాదన చేశారు శ్రీశైల క్షేత్రంలో 50 లక్షల విద్యుత్ ఆదా కోసం 20 కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేయాలని ఆమోదం తెలిపారు వచ్చి మహా శివరాత్రికి క్షేత్రంలో అన్ని మౌలిక వసతులు పూర్తి చేస్తామన్నారు వీరశైవ ఆగమ పాఠశాలకి స్థలం కేటాయించారు పడితరం స్టోర్లో అసాధారణమైన రేట్లు ఉన్నాయని ప్రస్తుతం టెండర్ వేసిన రేట్లు తేడా ఉన్నాయని ఈ విషయమే కమిషనర్ కి లేఖ రాయడం జరిగిందన్నారు పడి తరం రేట్ల విషయమై కమిటీ వేస్తామన్నారు గణేష్ సదన్ త్వరగా పూర్తి కాంట్రాక్టర్ ఆదేశించాడు కొత్త కూక్ కాంప్లెక్స్ కూడా ప్రపోజల్ పెట్టామని తెలియజేశారు ఈఓ లవన్న మాట్లాడుతూ శ్రీశైలం క్షేత్రంలో ఇరవై ఐదు వేల మందికి భక్తులకు సరిపోయే డార్మెంటరీ నిర్మించి దానిలో భక్తునికి 50 రూపాయలకే ఏసీ డార్మెంటరీ వసతి కల్పిస్తామని ఈఓ లవన్న తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మరియు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.