సత్యం గెలిచింది అన్యాయం ఓడింది..
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ : రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఆశ్రయించిన రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట లభించడంతో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్ర రత్న భవనం నందు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పై బిజెపి ప్రభుత్వం అనేక విధంగా చిత్రహింసలకు గురిచేస్తూ వారిని అనరహ్హత వేటితో పార్లమెంట్ నుంచి తొలగించడం తో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకి ఆశ్రయించారు .సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ పై అనరహ్హత వేటును తొలగించి మరల లోక్ సభ సభ్యత్వాన్ని పొందడంపై మా అందరికీ ఆనందంగా ఉంది అన్నారు. బిజెపి ప్రభుత్వం ఎన్ని విధాలుగా హింసలకు గురిచేసినా భయపడకుండా నిలబడ్డ రాహుల్ గాంధీ న్యాయం జరిగిందని ,ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పీటర్ జోసఫ్ మాట్లాడుతూ సత్యం గెలిచింది అన్యాయం ఓడింది అన్నారు. రాహుల్ గాంధీ సభ్యత్వం మరల పొందడం వారు సింహం లాగా పార్లమెంట్లో అడుగుపెట్టడంపై కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం ఏర్పడిందని బిజెపి పతనం మొదలైందని ,ఈ దేశం నుండి బిజెపి పార్టీని తరిమికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతన ఉత్సాహంతో పని చేయడానికి సిద్ధమవుతున్నామని బిజెపి ప్రభుత్వం ఎన్ని విధాలుగా కుట్రలు చేసినా చివరికి న్యాయం వైపే ధర్మం నిలబడిందని, గాంధీయవాదంతో పోరాటం చేసిన రాహుల్ గాంధీ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇదే స్ఫూర్తితో యువజన కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగుతామనివారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సందీప్ రాష్ట్ర కార్యదర్శి రామ్ సింగ్ యువజన కాంగ్రెస్ నందిగామ అసెంబ్లీ అధ్యక్షులు ఆరిఫ్ , రహీం, ప్రదీప్, శివ, పృథ్వి మరియు ఇతర యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.