NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

– చంద్రబాబుపై బనాయించిన అక్రమకేసు కొట్టివేయాలి

– మండల 74 వ బూతు ఇంచార్జ్ టిడిపి యువ నాయకులు ఆవుల పవన్ కుమార్ రెడ్డి ,

మండల ఐటీడీపీ ఇన్చార్జి యామల మణికంఠ

పల్లెవెలుగు వెబ్​:చెన్నూరు టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిజం గెలవాలి..జగనాసురిడికి కళ్లు తెరిపిద్దాం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు టిడిపి మండల 74 వ బూతు తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక  బుడాయపల్లె టిడిపి నాయకులతో కలిసి ఆయన కళ్లకు గంతలు కట్టుకుని, ప్లేకార్డులు పట్టుకుని అలాగే ముండ్ల పల్లెలో ఐ టి డి పి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సిఎం చంద్రబాబును అక్రమఅరెస్టు చేసి నేటికి 51 రోజు గడుస్తుందని, ఆయనకు బెయిల్ రాకుండా వైకాపా ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. ఇలాంటి నియంతృత్వ ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండదన్నారు. చంద్రబాబు అనారోగ్య రిత్య వెంటనే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే వైకాపా ప్రభుత్వం కళ్లు తెరిచి, చంద్రబాబుపై బనాయించిన అక్రమకేసును కొట్టివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలే వైకాపా ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అల్లాడు రాజశేఖర్ రెడ్డి, వేణు, నవనీశ్వర్ రెడ్డి, శశి కుమార్ రెడ్డి, నవీన్, మురళి, సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, సుందర్, భాస్కర్,

తదితర టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author