ఈడీ అధికారుల వేషంలో బంగారం దోపిడికీ యత్నం !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల వేషంలో బంగారు దుకాణంలో దోపిడీకి యత్నించిన ఏడుగురు నిందితులను నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎయిర్ పిస్టల్, పెల్లెట్స్, రెండు ఇన్నోవా కార్లు, తొమ్మిది సెల్‌ఫోన్లు, నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ (క్రైమ్స్) కె.చౌడేశ్వరి ఈ వివరాలను వెల్లడించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణాపురానికి చెందిన ఆరవీటి రమేష్ ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. వ్యాపారం చేస్తున్నా ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడంతో ఎలాగైనా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని రమేష్ నిర్ణయించుకున్నాడు. ఈడీ అధికారులు ఎక్కడైనా దాడులు చేయొచ్చు.. ఏదైనా సీజ్ చేయొచ్చని పత్రికల్లో వచ్చిన కథనాలను చదివాడు. నకిలీ ఈడీ అధికారి అవతారమెత్తి బంగారు ఆభరణాలు కాజేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని యోగానంద్‌గౌడ్‌కు, పీఏ కౌశల్‌రావుకు తెలియజేశాడు. యోగానంద్‌గౌడ్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన మద్దిలేటి గౌడ్, నంద్యాల జిల్లాకు చెందిన జి.బాలకృష్ణ, మామిళ్లపల్లికి చెందిన జి.బాబును కలిశాడు. ఈ ఆరుగురు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు.