NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సినీ న‌టి పై టీటీడీ సిబ్బంది దాడి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సినీ నటి, కాంగ్రెస్ నేత అర్చనా గౌతమ్ తిరుమలలో కలకలం సృష్టించారు. వీఐపీ దర్శనం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.10,500 వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. తాను డబ్బులు చెల్లించినా గానీ, రసీదు ఇచ్చి టోకెన్ ఇవ్వలేదని ఆరోపించారు. దర్శన టోకెన్ కోసం ప్రశ్నిస్తే టీటీడీ సిబ్బంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అర్చనా గౌతమ్ తెలిపారు. స్వామివారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన తనతో టీటీడీ సిబ్బంది దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, నటి ఆరోపణలను టీటీడీ ఖండించింది. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనానే దాడి చేసిందని ఆరోపించింది. అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేసిందని వివరించింది. రూ.10,500 టికెట్ తో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలని సూచిస్తే, దర్శనం కోసం రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించిందని వివరించింది.

                                         

About Author