NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైఎస్ ష‌ర్మిల‌ను క‌లిసిన టీటీడీ అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వైసీపీ నేత‌, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిల‌ను క‌లిసారు. మ‌హేశ్వరంలో నియోజ‌క‌వ‌ర్గంలో ష‌ర్మిల ప్రజాప్రస్థానం పాద‌యాత్ర ఐదోరోజు కొన‌సాగుతోంది. పాద‌యాత్రకు సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో ఈ భేటికి రాజ‌కీయ ప్రాధాన్యం నెల‌కొంది. ఆదివారం నాగారం గ్రామంలో ష‌ర్మల బ‌స చేసిన ప్రాంతంలో సుబ్బారెడ్డి ఆమెను క‌లిశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ తో విబేధాల అనంత‌రం తెలంగాణ‌లో పార్టీ పెట్టిన వైఎస్ ష‌ర్మిల‌ను .. వైసీపీ ముఖ్య నేత క‌ల‌వ‌డం ప్రాధాన్యత సంత‌రించుకుంది.

About Author