అవగాహనతో ‘క్షయ’ దూరం : డీఎంహెచ్ఓ డా.బి.రవి
1 min readపల్లెవెలుగు వెబ్, ఏలూరు: క్షయవ్యాధి మైకో బాక్టీరియమ్ ట్యుబర్క్యూలోసిస్ అనే సూక్ష్మ క్రిమి వల్ల సంక్రమించే అంటువ్యాధి. క్షయ రోగి దగ్గినపుడు,తుమ్మినపుడు,తుంపర్ల ద్వారా గాలిలో వ్యాపించి మరో మనిషికి సంక్రమిస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.రవి అన్నారు. గురువారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ప్రపంచ క్షయవ్యది నివారణ దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు,జ్వరం,ఆకలి మందగించడం,బరువు తగ్గడం, కఫం లో రక్తం పడటం. పై లక్షణాలు ఉన్నవారు తెమడ ( కఫం) పరీక్ష మైక్రోస్కోప్, ట్రూనాట్ మరియు సీ బీ నాట్ అనే అధునాతన పరికరాల ద్వారా పరీక్షలు చేసి నిర్ధారించవచ్చునని తెలిపారు, పశ్చిమగోదావరి జిల్లాలో 17 ట్రూనాట్ మరియు 4 సీ బీ నాట్ (CBNAAT) వ్యాధి నిర్ధారణ యంత్రాలు మరియు అన్ని PHC మరియు CHC లలో మైక్రోస్కోప్ ద్వారా మరియు వైద్యాధికారులు ద్వారా పరీక్షించుకోవచ్చునని తెలిపారు. టీ బీ నిర్ధారణ అయిన తర్వాత నాణ్యమైన మందులు ఉచితంగా అన్ని ఆరోగ్య కేంద్రాలలో 6 నెలల పాటు అందించబడతాయని, వీరికి ఆహార పోషణ నిమిత్తం నెలకు రూ.500/ వారి ఖాతాలలో జమ చేయబడతాయని తెలిపారు. 2021 సంవత్సరంలో పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తిగా 58,738 టీ బీ నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ జైళ్లలోని ముద్దాయి లందరకు,పరిశ్రమలలో పనిచేసే కార్మికులను,ఓల్డ్ ఏజ్ హోమ్ లలో వారిని పరీక్షించి 6,230 క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించడం జరిగింది. వీరిలో 97శాతంమందివిజయవంతంగా మందులు వాడి కోలుకోవడం జరిగింది.
ఈ ఏడాది… టీబీ కార్యక్రమాలు:
1. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ 2025 కల్లా పూర్తిగా క్షయవ్యాధిని సమాజం నుండి పారద్రోలాలనే కృతనిశ్చయంతో మన జిల్లాలో ఈ సంవత్సరం అన్ని ట్రైబల్ మండలాల్లో ” పరిమల్ స్వాస్త్” వారి ద్వారా టీ బీ వ్యాధిని గుర్తించడానికి 100 రోజులు ప్రోగ్రాం చేయించడం జరుగుతుంది.
2. అన్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ & వెల్ నెస్ క్లినిక్ ల ద్వారా 21 రోజులు అన్ని గ్రామాల్లో యాక్టీవ్ కేస్ ఫైండింగ్ చేయించటం జరుగుతుంది. ప్రజలు అందరూ టీ బీ లక్షణాలను త్వరగా గుర్తించి వెంటనే డాక్టరు సలహాతో టీ బీ పరీక్ష చేయించుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ త్వరగా చేయించుకుని మందులు వాడటం ద్వారా అతను త్వరగా కొలుకోవటంతో పాటు సమాజానికి కూడా ఈ వ్యాధి సోకకుండా కాపాడటానికి దోహద పడుతుందని అన్నారు. ఈ కాయక్రమంలో డా.బి. భాను నాయక్ జిల్లా క్షయ నియంత్రణ అధికారి,హాస్పిటల్ సుపరిండెంట్ ఏ వి ఆర్ మోహన్,ఇతర డాక్టర్ లు , నర్సులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టిబి నివారణ ప్రచార వాహనం డిఎం అండ్ హెచ్ ఓ జెండా ఉపి ప్రారంభించారు.