తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రప్రకటించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మండల కేంద్రమైన తుగ్గలి లో తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలని టిడిపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలోనే మంత్రాలయం బెంగళూరు రహదారి వద్దా రైతులు ఎద్దుల బండ్లతో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంపై ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని విపక్షాల నాయకులు అన్నారు. గంటల తరబడి జాతీయ రహదారిపై ఎద్దుల బండ్లతో కమ్యూనిస్టు పార్టీలు టిడిపి జనసేన పార్టీల కార్యకర్తలు రాష్ట్ర రోక నిర్వహించారు. ఈ కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసిన ప్రయోజనం లేకపోయింది. తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించే వరకు తమ నిరసనలు ఆగే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. పోలీసులు ఆందోళన కారులను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కొంతసేపు వారి మధ్య సందిగ్ధం నెలకొంది. ఈ రాస్తారోకో కార్యక్రమం సిపిఎం సిపిఐ టిడిపి జనసేన నాయకులు రంగారెడ్డి శ్రీరాములు వెంకట రాముడు తిరుపాలు వెంకటేశ్వర్లు నాయకత్వంలో జరిగింది.