తుంగభద్రకు వరద !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తుంగభద్ర ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో – 85,722 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో – 221క్యూ సెక్కులుగా కొనసాగుతుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం – 1,633 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం నీటి మట్టం – 1626.22 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ – 105.788 టీఏంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ – 80.549 టీఎంసీలుగా ఉంది.