NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పన్నెండో మనిషి

1 min read

సినిమా డెస్క్​: కొంతమందికి కొన్ని కాంబినేషన్‌లు కలిసొస్తాయి. ఆ కోవకు చెందినదే..మలయాళ స్టార్‌‌ హీరో మోహన్‌ లాల్‌కి జీతూ జోసెఫ్ అచ్చొచ్చాడు. అతడు మోహన్‌ లాల్‌తో తీసిన చిత్రాలన్నీ పెద్ద హిట్‌కొడుతున్నాయి. రీసెంట్‌గా ‘దృశ్యం 2’ ఎంత పెద్ద సక్సెస్‌ సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ సూపర్ హిట్ కాంబోలో మరో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ‘రామ్’ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తిచేసేశారు. నిన్న మరో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దీనికి ’12th మ్యాన్‌’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోస్టర్‌‌ చూస్తుంటే ఇదో థ్రిల్లర్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోని పెరంబవూర్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ కి వెళ్లనుంది. మరోవైపు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో బ్రో డాడీ, లూసిఫర్ 2 సినిమాలు తెరకెక్కనున్నాయి. ఇదిలా ఉంటే నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీ ‘మరక్కర్’తో పాటు యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఆరట్టు’ సినిమాల విడుదల కోసం వెయిట్ చేస్తున్న మోహన్‌లాల్‌ ఫస్ట్‌ టైమ్‌ మెగా ఫోన్‌ పట్టి ‘బారోజ్’అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

About Author