PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

9 సెక‌న్ల‌లో కూల‌నున్న ట్విన్ ట‌వ‌ర్స్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశం దృష్టి మొత్తం నోయిడాలోని ట్విన్‌టవర్స్‌పైనే ఉంది. సూపర్‌టెక్ సంస్థ నిర్మించిన ఈ జంట టవర్ల కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. నేటి మధ్యాహ్నం సరిగ్గా 2.30 గంటలకు అందరూ చూస్తుండగానే క్షణాల వ్యవధిలోనే నేలమట్టం కానున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ భవనాలను కూల్చివేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం భవనాల వద్దకు చేరుకున్న పోలీసులు ఈ భవనాలున్న ఎమరాల్డ్ కోర్టు సొసైటీలోని వేలాదిమందిని ఖాళీ చేయిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్చివేతకు సిద్ధమైన అధికారులు.. భవనాల కూల్చివేతకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగిస్తారు. ఈ ఉదయం నుంచే కూల్చివేత పనుల పర్యవేక్షణ ప్రారంభమైంది. ఈ ట్విన్ టవర్ల పేర్లు అపెక్స్.. సేయాన్. పేలుడు పదార్థాలతో కూల్చివేస్తున్న దేశంలోనే ఎత్తైన భవనాలు ఇవి. కేవలం 9 సెకన్లలోనే ఇవి నేలమట్టం కానున్నాయి. భవనాలకు 50 మీటర్ల చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ అటువైపు రాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.

                                         

About Author