PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిట్వేలిలో మురిసిన.. మువ్వన్నెల జెండా

1 min read

పల్లెవెలుగు వెబ్​, చిట్వేలు: 75వ స్వాతంత్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిట్వేలి మండలంలో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఎంపిపి కార్యాలయంలో మండలకన్వీనర్ చెవ్వు.శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్ సిపి నాయకులు, అధికారులతో కలసి జెండా ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేశారు. అలాగే తాసీల్ధార్ జీవన్ చంద్రశేఖర్ ,ఎంపిడిఓ నాగభూషణం, ఎస్.ఐ. వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులకృష్ణమూర్తి,ఎఫ్.ఆర్.ఓ.శ్రీకాంత్, సబ్ రిజిస్ట్రార్ ఖాలేషా, డాక్టర్ శివప్రసాద్ గౌడ్, ఆయా కార్యాలయాల ఆవరణంలో జాతీయ జెండా ఎగురవేసి వందనసమర్పణ చేశారు. అదేవిధంగా అన్నిప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు,వసతి గృహాలు,కార్యాలయాలు, గ్రామసచివాలయాలలోమువ్వన్నెలజండా రెపరేపలాడింది. ఈసందర్బంగా పలుచోట్ల అల్పాహారం ఏర్పాటుచేసి మిఠాయిలు పంచారు. ఈకార్యక్రమంలో చిట్వేలిసర్పంచ్ మహేశ్వరరెడ్డి, రాష్ట్రకార్యవర్గసభ్యులు వెంకటరమణ, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


About Author