ఎలన్ మస్క్ ఎంట్రీతో జోరు మీదున్న ట్విట్టర్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ ట్విటర్‌లో 9.2 శాతం వాటాలను కొన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి 10, 2022 నాటికి ట్విటర్‌లో9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ కలిగి ఉన్నారని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో వెల్లడైంది. ఎలన్ మస్క్ తమ కంపెనీలో 73,486,938 షేర్లను కొనుగోలు చేశారని ట్విటర్ ఇంక్ కూడా తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ షేర్లు విలువ శుక్రవారం క్లోజింగ్ ధర 2.9 బిలియన్ డాలర్లుగా ఉంది.ట్విటర్‌లో ఎలన్ మస్క్ వాటాలను కల్గి ఉన్నారనే వార్తల నేపథ్యంలో.. ట్విటర్ ఇంక్ షేర్లు 25.8 శాతం పైకి ఎగిశాయి. దీంతో ట్విటర్ ఇంక్ షేరు వాల్యు 49.48 డాలర్లకు చేరింది. ఈ వాటాల కొనుగోలుతో ట్విటర్‌లో అతిపెద్ద షేర్ హోల్డర్‌గా ఎలన్ మస్క్ నిలిచారు.