అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లో తమ కూటమి అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉపముఖ్యమంత్రులు ఉంటారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రుల్లో ఒకరు బీసీ వర్గానికి చెందినవారు, మరొకరు దళిత వర్గానికి చెందిన వారు ఉంటారని తెలిపారు. ఉపముఖ్యమంత్రుల్లో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారు ఉంటారని అన్నారు. యూపీలో బాబు సింగ్ కుష్వాహా, భారత్ ముక్తిమోర్చ తో ఎంఐఎం పొత్తు కుదుర్చుకుందని అసదుద్దీన్ ప్రకటించారు. ఎస్‌బీఎస్‌పీ సొంత నిర్ణయం తీసుకుని కూటమి నుంచి వైదొలిగిందని, అయితే ఎంఐఎం పటిష్టంగా ఉన్నందున 100 సీట్లలో పోటీ చేస్తామని ఒవైసీ చెప్పారు. ముస్లింల అభివృద్ధికి ఏ ఒక్క పార్టీ పని చేయలేదని ఆరోపించారు.