మిడుతూరు ఆసుపత్రికి ఇద్దరు వైద్యులు..
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనకు ఇద్దరు వైద్యులు నియమితులయ్యారు.వైద్య శాఖలో సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీలు జరిగాయి.ఓర్వకల్లు సీహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న జనరల్ సర్జన్ డాక్టర్ అశ్విన్ కుమార్ మరియు అవుకు నుండి గైనిక్ డిపార్ట్మెంట్ నందు డాక్టర్ సుష్మ మిడుతూరుకు బదిలీపై వచ్చారు.బుధవారం వారు బాధ్యతలు చేపట్టినట్లు డాక్టర్లు తెలిపారు.మిడుతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో అన్ని విభాగాలకు సంబంధించిన డాక్టర్లు ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి అన్నారు.కావునా మండల ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని డాక్టర్లు కోరారు.