నిండు జీవితానికి రెండు చుక్కలు
1 min readపల్లెవెలుగు వెబ్, చాగలమర్రి: చిన్నారుల నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కుష్టువ్యాధి నివారణ అధికారి , పల్స్ పోలియో ఆళ్లగడ్డ డివిజన్ అధికారి దేవసాగర్ తెలియజేశారు .చాగలమర్రి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో,గుంత పాలెం వీధిలోని పల్స్ పోలియో కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. చాగలమర్రి మండల వ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో కార్యక్రమాన్ని 32 పోలింగ్ కేంద్రాల్లో ప్రారంభించారు . చాగలమర్రి పట్టణంలో సర్పంచ్ తులసమ్మ,ఉపసర్పంచ్ సోహెల్ లు, మండలంలోని తోడేంళ్లపల్లెలో సర్పంచి రామిశెట్టి గోవిందయ్య,పెద్దవంగలిలో సర్పంచ్ బంగారు షరీప్ పోలియో చుక్కలను వేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా వైద్యులు గంగాధర్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 32 పోలింగ్ కేంద్రాల పరిధిలో 166 మంది సిబ్బందిచే పోలియో చుక్కలను వేశామన్నారు . 5007 మంది . చిన్నారులకు గాను 4841 మందికి చుక్కలను వేసి 96 శాతం పూర్తి చేశామన్నారు . కార్యక్రమంలో సీహెచ్‌ఓ రెడ్డమ్మ , హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటమ్మ , హెల్త్ సూపర్వైజర్ రామలింగారెడ్డి,ప్రమీలమ్మ,సీతారాముడు లు పాల్గొన్నారు.