బాధిత కుటుంబాలకు రెండు లక్షల ఆర్థిక సహాయం
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది క్షేత్రంలోని నాగనంది సదనం నందు ఉన్న 12 పాత వసతి గృహాలను తొలగించు సందర్భంలో గత కొన్ని రోజుల క్రితం ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మృతి చెందిన తాటిపర్తి వెంకటేశ్వర్లు గుత్తి వెంకటరాముడు కుటుంబ సభ్యుల కు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కును మహానంది దేవస్థానం ఈవో నల్లకాలువ శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు తదితరులు పాల్గొన్నారు.