ఎమ్మెల్యేలు రెండు.. ఎంపీ ఒక సీటు కేటాయించండి..
1 min readనారా లోకేష్‌ను కోరిన కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు
పల్లెవెలుగు: కర్నూలులో యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో మెమొరాండం ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఐదు లక్షల ఓటర్లు ఉన్న కురువలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని అలాగే కురువలకు ఇవ్వాల్సిన పదవులు యాదవులకు కట్టబెట్టారని కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి ,జిల్లా సహాయ కార్యదర్శి బి .సి .తిరుపాలు పట్టణ అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు వినతిపత్రాన్ని లోకేష్ కు ఇచ్చారు . అలాగే 2024 ఎన్నికల్లో కురువలకు ఒక ఎంపీ రెండు ఎమ్మెల్యే స్థానాలు పత్తికొండ ,ఆలూరు స్థానాలను కేటాయించాలని కోరారు. 2014 తెలుగుదేశం మేనిఫెస్టోలో కురువలను ఎస్టీలు చేరుస్తామని పెట్టి దాన్ని ఊసే ఎత్తలేదు అని వారు తెలిపారు. కురువలు, యాదవులు ఒకటి కాదని కురువలకు ఇవ్వాల్సిన పదవులను యాదవుల కు కట్టబెట్టి కురువలకు ఇచ్చామని చెప్పి తెలుగుదేశం పార్టీ మమ్మల్ని మోసం చేశారని కురువ సంఘం నాయకులు తెలిపారు. కర్నూలు జిల్లాలో సుమారు సర్పంచులు ఎంపీటీసీలు 150 దాకా గెలిచామని తెలిపారు .మా ప్రధాన వృత్తి గొర్రెల పెంపకం మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వంలో శూన్యమని తెలిపారు. జిల్లాలో అన్ని నియోజకవర్గంలో మేము బలంగా ఉన్నామని మాకు సీట్లు కేటాయించకపోతే మా సత్త ఏందో చూయిస్తామని కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు పేర్కొన్నారు.