రెండు నెలల లైసెన్స్ ఫీజు రద్దు.. బార్లకు తీపికబురు
1 min readపల్లెవెలుగు వెబ్ : రెండు నెలల లైసెన్స్ ఫీజు రద్దు చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నుంచి కోలుకుని, కొన్ని సడలింపులిస్తూనే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వార బార్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. కరోన లాక్ డౌన్ కారణంగా వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయని, అందువల్ల వారికి అవకాశం కల్పించినట్టు ప్రభుత్వం తెలిపింది. కరోన కారణంగా ఇటీవల ఢిల్లీలో కఠినమైన లాక్ డౌన్ అమలు చేశారు. దీంతో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వ్యాపారాలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకర నిర్ణయాలు తీసుకుంటోంది.