PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో మ‌రో రెండు రోజులు ఇంతే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: బ‌ంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినప్పటికీ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా, రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. రేపు (అక్టోబరు 7) రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి (అక్టోబరు 8) రాయలసీమ, ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

                                         

About Author